- మావోయిస్టుల భయంతో వలసవెళ్లిన 35 కుటుంబాలు
- సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు ఏర్పాటు చేసి వసతుల కల్పన
- పోలీసుల విజ్ఞప్తితో ఇండ్లకు తిరిగొచ్చిన గ్రామస్తులు
భద్రాచలం, వెలుగు : 20 ఏండ్ల తర్వాత ఆదివాసీలు తమ సొంతూళ్లకు వెళ్లారు. చత్తీస్గఢ్లోని నారాయణ్పూర్జిల్లా గర్పా గ్రామానికి చెందిన35 కుటుంబాలు మావోయిస్టుల భయంతో వలసపోయాయి.2003లో సల్వాజుడుం, మావోయిస్టుల మధ్య జరిగిన పోరులో నలిగిపోయిన వీరంతా వేరే ప్రాంతానికి వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల గర్పాలో సీఆర్పీఎఫ్జవాన్లతో బేస్క్యాంపును కేంద్రం ఏర్పాటు చేసింది.
దీనికి తోడు జిల్లా కేంద్రం నారాయణ్పూర్వరకు రోడ్డును నిర్మించి బస్సులు, ఇతర వాహనాలను తిప్పుతున్నా రు. గ్రామాన్ని వదిలి వెళ్లిన ప్రజలు తిరిగి రావాలంటూ నారాయణ్పూర్జిల్లా పోలీసులు పిలుపునిచ్చారు. దీంతో 35 కుటుంబాలు గ్రామానికి చేరుకోగా.. ముందుగా గర్పా శివాలయంలో పోలీసులు అర్చనలు చేయించారు. అక్కడ కల్పించిన సదుపాయాలను చూసి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలో తమ ఇండ్లలోకి వెళ్లారు.