వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ సంచనాలకు మారు పేరుగా నిలుస్తుంది. పసికూన ముద్రను చెరిపేసుకుంటూ సెమీస్ రేస్ ను ఆసక్తికరంగా మార్చింది. వీటిలో కివీస్ తో ఓడగా.. ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లను ఓడించి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి జట్లకు కొత్త తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థా ఈ మెగా టోర్నీలో మొదటి రెండు మ్యాచ్ లు ఓడిన ఆఫ్ఘన్.. ఆ తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు విజయాలను సాధించింది. వీన్ ఖాతాలో 6 పాయింట్లు ఉండగా.. మరో మూడు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి.
ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ జట్టుకే సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫ్ఘన్ తన చివరి మూడు మ్యాచ్ లను నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లపై ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్ లు గెలిస్తే ఆసీస్, కివీస్ జట్లలో ఒక జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. ఆడిన 6 మ్యాచుల్లో నాలుగు మ్యాచ్ లు గెలిచిన కివీస్.. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక జట్లపై మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటిలో రెండు మ్యాచ్ లు ఓడినా ఆఫ్ఘనిస్తాన్ కు కలిసి వస్తుంది.
మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ పై ఆడే మూడు మ్యాచ్ ల్లో రెండు ఓడిపోయినా సెమీస్ కు చేరడం కష్టం. నిన్నటివరకు భారత్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ చేరుతాయని ఆశించినా ఒక్కదారిగా ఆఫ్ఘనిస్తాన్ ఫామ్ ఈ రెండు జట్లను కంగారు పెడుతుంది. పెద్ద జట్లపై వరుస విజయాలు సాధించి ఆత్మవిశ్వాసంతో కనబడుతున్న ఆఫ్ఘనిస్తాన్ మరిన్ని సంచలనాలు సృష్టించినా ఆశ్చర్యం లేదు. మరి వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లు ముగిసేసరికి ఎవరెవరు ఏ స్థానాల్లో ఉంటారో చూడాలి.