IND vs AFG: టీమిండియాతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు

IND vs AFG: టీమిండియాతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు

టీమిండియాతో టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలిసారి భారత్ లోకి అడుగుపెడుతుంది. జూన్ 11 న నుంచి 3 టీ20 ల సిరీస్ జరగనుంది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీ 19 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టును ప్రకటించింది. ఇబ్రహీం జద్రాన్ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవరిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఈ సిరీస్ కు ఎంపిక చేసినా.. ఆడటం అనుమానంగా మారింది.   గత నెలలో ఈ స్టార్ స్పిన్నర్ వెన్ను గాయంతో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. 

ఇటీవలే షార్జాలో UAEతో జరిగిన సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను 2-1తో విజయం సాధించింది. ఈ సిరీస్ లో భాగం కానీ స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ భారత్ తో సిరీస్ కు ఎంపికయ్యాడు. ఇక్రమ్ అలిఖిల్  బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా జట్టులో కొనసాగుతాడు. జనవరి 11 న మొహాలీలో తొలి టీ20, 14 న ఇండోర్ లో రెండో టీ20, 17న బెంగళూరులో మూడో టీ20 జరుగుతాయి. భారత జట్టును ప్రకటించాల్సి ఉంది 

ACB చైర్మన్ మిస్టర్ మిర్వాయిస్ అష్రఫ్ మాట్లాడుతూ “మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత్‌లో మా తొలి పర్యటనను ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము. టాప్ ర్యాంక్ లో ఉన్న భారత్ పై ఆడేందుకు చాలా గర్వంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇకపై అండర్ డాగ్ కాదని విశ్వసిస్తున్నాం". అని తెలిపారు.   
 
ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్

ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనాత్, అజ్మౌల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రహ్మద్, ఫజల్ హఖ్మాన్, ఎఫ్. నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీమ్, కైస్ అహ్మద్, గుల్బాదిన్ నాయబ్ మరియు రషీద్ ఖాన్.