వందేళ్ల తర్వాత ఆదివారం వస్తున్న అద్భుత ముహూర్తం... ఏ దేవుడిని ఎలా పూజించాలి.

వందేళ్ల తర్వాత  ఆదివారం  వస్తున్న అద్భుత ముహూర్తం... ఏ దేవుడిని ఎలా పూజించాలి.

అత్యంత అరుదుగా వచ్చే  రోజు ఆదివారం.. అమావాస్య.. పుష్యమి నక్షత్రం.. అందులోనూ ఇలాంటి రోజు ఆషాడమాసంలో వచ్చిందంటే.. అంతకంటే పవిత్రమైన రోజు ఉండదు. పంచాగ కర్తలు తెలిపిన వివరాల ప్రకారం  100 సంవత్సరాలకు  ఒకసారి వస్తుంది.  మరి అలాగే ఎంతో మందికి ఇష్టమైన ఈ రోజు ఎలా ఉంటుంది, దాని యొక్క విశిష్టత ఏమిటి ..  ఆ రోజు ఏ దేవుడిని పూజించాలి.. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ ఏడాది ( 2024)  అత్యంత అరుదుగా వచ్చే ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం (Pushyami Star) తో కూడి ఉన్నది. ఆదివారం అమావాస్య అనేది సంవత్సరానికి  ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక మూడు లేదా నాలుగు సార్లు వస్తుంది.
కొన్ని సందర్భాల్లో ఆదివారం పుష్యమి నక్షత్రం తో కలిసి వస్తుంది అది పుష్యర్క యోగం. ఈ యోగంలో  ఎలాంటి పూజ చేసినా.. నూరు రెట్లు ఫలితం కలుగజేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 

ఈ ఏడాది 3 ఆగస్టు 2024 శనివారం మధ్యాహ్నం 3:31 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 4 ఆగస్టు 2024 ఆదివారం మధ్యాహ్నం 3:54 గంటల వరకు ఉంటుంది. ఇదే రోజున ( ఆగస్టు 4)  పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:26 గంటల వరకు ఉంటుంది. 

100 ఏళ్ల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అత్యంత అరుదుగా వచ్చేటటువంటిది ..ఆదివారం ..అమావాస్య... పుష్యమి నక్షత్రం (Pushyami Star) ఈ మూడు కలిసిన రోజు చాలా ప్రాముఖ్యమైనది ఎంతో శుభదాయకమని  విష్ణు పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆదివారం  ( ఆగస్టు 4) అమావాస్య ..పుష్యమి నక్షత్రం (Pushyami Star) ఏర్పడబోతుంది.

ఈ రోజున  లలితాపరమేశ్వరి అమ్మవారిని పూజించాలి.  అమ్మవానికి పసుపు.. కుంకుమతో అలంకరించి.. షోడశ పూజలు చేయాలి.  అమ్మవారికి పులగం నివేదన ఇవ్వాలి.  తరువాత లలితాసహస్రనామం పారాయణ చేయాలి.  ఇలా అవకాశం లేకపోతే.. లలితా సహస్రనామాన్ని శ్రద్దగా వినాలి.   ఈ రోజున పుణ్య నదుల్లో స్నానమాచరించాలి. పితృదేవతలకు తర్పణాలు వదలాలి.

అమ్మవారిని లలిత త్రిపుర సుందరిగా పేర్కొంటారు. త్రిపుర సుందరి అంటే ముల్లోకాలలలోనూ అందంగా ఉండేది అని అర్థం. కానీ త్రిపుర అనే మాటను మూడు కాలాలకు, మూడు స్థితులకు, మూడు శక్తులకు ప్రతీకగా పేర్కొనవచ్చు. లలితలో ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషం అంటారు. అంతేకాకుండా ఊతపదాలు కూడా ఇందులో ఉండవు. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యాకరణపరంగా కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు

 బ్రహ్మాండ పురాణం ప్రకారం .. శ్రీ లలిత సహస్రనామములు రహస్యమయములు. అపమృత్యువులను, కాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివారించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదిస్తాయి. సకల సంపదలనూ కలిగిస్తాయి. ఈ స్తోత్రాన్ని శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం పఠించాలి. అన్ని పాపాలను హరించడానికి లలితాదేవియొక్క ఒక్కనామం చాలును. భక్తుడైనవాడు నిత్యం గాని, పుణ్యదినములయందుగాని ఈ పారాయణ చేయాలి.  లలితాసహస్రనామస్తోత్రమును  పఠిస్తే శ్రీదేవి సంతసించి సర్వభోగములను ప్రసాదించును.

ALSO READ | అద్భుతమా.. మహా అద్భుతమా..! ....ఆదివారం.. ఆషాఢ అమావాస్య.. పుష్యమి నక్షత్రం

దక్షిణాది వారు ఈ రోజును  ఆషాడ అమావాస్య అంటే .... ఉత్తరాది ప్రాంతం వారు హరియాలా అమావాస్య అనే పేరుతో దానిని పిలుచుకుంటారు. అయితే సహజంగా మనం ఎన్నో దేవతా పూజలు హోమాలు అభిషేకాలు ప్రతి రోజు చేయించుకుంటూ ఉంటాము. కొంత మంది ఉపాసనపరులు, తంత్రవేత్తలు అలాగే దేవతా సంబంధమయిన పూజలు బాగా చేసుకునే వారికి ఈ ఆషాడ అమావాస్య పుష్యమి నక్షత్రం (Pushyami Star) చాలా విశేషమని పురాణాలు చెబుతున్నాయి. 

మనకు వృక్ష దేవత ఆరాధన కూడా హిందూ ధర్మంలో సాంప్రదాయమే అందుకనే రావి చెట్టు చుట్టూ అలాగే మర్రి చెత్తు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటాం, అలాగే మామిడి చెట్టు దగ్గర కూడా తిరుగుతూ ఉంటాం, ఆది దంపతులు అయిన పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కోసం. అయితే అమావాస్య.. ఆదివారం.. పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో   ప్రకృతి లో ద్విగుణనీకృతమై ఉన్న దేవతా శక్తులు ఆరోజు భూమ్మీద సంచరిస్తూ ఉంటాయి.  అంటే రేపు ( ఆగస్టు 4) అన్నమాట. 

పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు కానీ పుష్యమీ నక్షత్రానికి  దేవత  బృహస్పతి, నవగ్రహాలలో ఒక గ్రహం దేవతల గురువు అందుకే పుష్యమి నక్షత్రం ...  బృహస్పతి నా మంతో ప్రారంభం అవుతుంది, నవగ్రహాల్లో అత్యంత శుభకరుడు ఎవరయ్యా అంటే బృహస్పతి.

పుష్యమీ నక్షత్రం (Pushyami Star) అర్థం ఏమిటంటే పోషింప బడేది పోషించేది పుష్టిని కలిగించేది అనగా మనం ఆ యొక్క పుష్యమి నక్షత్రం లో ఏది చేసిన మనకు అనుకూలంగా మారుతుంది . ఈ యొక్క పుష్యమి నక్షత్రం (Pushyami Star) లో ఏ పని మొదలు పెట్టినా తొందరగా అవుతుంది కారణం ఏంటంటే మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో క్షిప్రతారా లో  అంటే అశ్వని, పుష్యమి, హస్త నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు ఏ పని చేసినా అత్యంత శీఘ్రంగా ఫలితాన్నిస్తాయి.

 మన దేవతలలో వినాయకుడు సంబంధించిన దేవతల చూసుకున్నట్లయితే క్షిప్ర గణపతి అంటారు అంటే అన్ని గణపతులు యోగాలనిస్తాయి. కానీ ఈ క్షిప్ర గణపతి ని ఎవరైతే ఆరాధిస్తారో చాలా తొందరగా వారి కోరికలు నెరవేరుతాయి.