జనవరి 6 నుంచి మార్చి 9 వరకు అగ్నివీర్ రిక్రూట్​మెంట్‌‌ ర్యాలీ

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌‌లోని జోగిందర్ సింగ్ స్టేడియం, ఏఓసీ సెంటర్‌‌లో వచ్చే ఏడాది జనవరి 6 నుంచి మార్చి 9 వరకు అగ్నివీర్(ఆర్మీ) రిక్రూట్​మెంట్‌‌ ర్యాలీ జరగనుంది. 17 నుంచి 21 ఏండ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ రిక్రూట్ మెంట్ కు హాజరు కావొచ్చని మిలటరీ అధికారులు సూచించారు. 

అగ్నివీర్ జనరల్ డ్యూటీ, ఆఫీస్ అసిస్టెంట్, చెఫ్, అగ్నివీర్ ట్రేడ్స్‌‌మెన్ తదితర విభాగాల్లో  ఖాళీలను భర్తీ చేయనున్నామని తెలిపారు. ఇందులో జనరల్ డ్యూటీకి అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి 45 శాతం మార్కులతో (ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం) పాసై ఉండాలని చెప్పారు. అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్​కు 60 శాతం మార్కుల (ప్రతి సబ్జెక్టులో కనీసం 50 శాతం)తో ఇంటర్ ఉతీర్ణులై ఉండాలని పేర్కొన్నారు.

అగ్నివీర్ ట్రేడ్స్‌‌మెన్ కు10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని వెల్లడించారు. అలాగే స్పోర్ట్స్ కోటా కింద కూడా అగ్నివీర్​రిక్రూట్ మెంట్‌‌ర్యాలీ నిర్వహించనున్నామని వివరించారు. ఈ కోటా కింద ట్రాక్ అండ్ ఫీల్డ్, స్విమ్మింగ్, డైవింగ్, వెయిట్ లిఫ్టింగ్​సహా అథ్లెటిక్స్ వంటి ఈవెంట్లలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారులు తమ సర్టిఫికెట్లతో పాల్గొనవచ్చని తెలిపారు. 

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ప్రధాన కార్యాలయం ఏఓసీ సెంటర్, ఈస్ట్ మారేడుపల్లి, తిరుమలగిరి, సికింద్రాబాద్‌‌ ని సంప్రదించాలని సూచించారు. tuskercrc-2021@gov.inకు ఇమెయిల్, www.joinindianarmy@nic.inని వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు.