
బెజ్జంకి, వెలుగు: మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలానికి అగ్రికల్చర్ కాలేజీ మంజూరైనట్లు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదివారం తెలిపారు. కోరుట్లలో ఉన్న అగ్రికల్చర్ కాలేజీని బెజ్జంకి మండలానికి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించి ఈనెల 28న ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు.
మండలానికి అగ్రికల్చర్ కాలేజీ మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే సత్యనారాయణకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, పార్టీ అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కృష్ణ, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అధికార ప్రతినిధి రాజశేఖర్ రెడ్డి, పోచయ్య, డైరెక్టర్ సంతోష్, రాజు ధన్యవాదాలు తెలిపారు.