
- విద్యార్థుల్లో ఆసక్తి ఉన్నా సిగ్నల్ప్రాబ్లమ్తో ముందుకు సాగని క్లాసులు
- కంప్యూటర్లపై అవగాహన లేని కొందరు టీచర్లు
- కామారెడ్డి జిల్లాలో 27 స్కూల్స్‌లో ఏఐ క్లాసులు అమలు
కామారెడ్డి, వెలుగు :చదువులో వెనుకబడిన విద్యార్థులను ఆర్టిఫీషియల్ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తొలి విడతగా కామారెడ్డి జిల్లాలోని 27 ప్రైమరీ స్కూళ్లను ఎంపిక చేసింది. ఈ నెల 15 నుంచి 3, 4, 5 తరగతుల విద్యార్థులకు క్లాసులు ప్రారంభించారు. సబ్జెక్ట్‌ల్లోని పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకునే వీలుంది కాబట్టి క్లాసులు వినాని విద్యార్థుల్లో ఆసక్తి ఉన్నా ఇంటర్నెట్ సమస్య వేధిస్తున్నది. ఎంపికైన ఏ స్కూల్లోనూ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. వారానికి నాలుగు రోజులు క్లాసులు ఉంటాయి.
తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో రోజు 20 నిమిషాల పాటు క్లాస్ ఉంటుంది. ఏ స్కూల్లోనూ ఇంటర్నెట్ లేని కారణంగా మొబైల్ నెట్కనెక్షన్తో టీచర్లు తరగతులు నిర్వహిస్తున్నారు. సెల్లో నెట్ బ్యాలెన్స్ ఉన్నంత వరకు క్లాసులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు సెల్ఫోన్లకు సిగ్నల్లేక కొన్ని పాఠశాలల్లో తరగతుల నిర్వహణ అంతంత మాత్రంగానే కొనసాగుతుంది. తెలుగు పాఠాలను నేర్చుకునేందుకు, గణితంలో కూడికలు, తీసివేతలు సులువుగా నేర్చుకునే అవకాశం ఉన్నా సిగ్నల్ ప్రాబ్లమ్‌తో క్లాసులు వినలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.
కొన్ని పాఠశాలల్లో టీచర్లకు కంప్యూటర్లపై అవగాహన లేక ఏఐ క్లాసులు అటకెక్కుతున్నాయి. ప్రస్తుతం హైస్కూళ్లలోని సిస్టమ్స్ వాడుకోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే అకాడమీ ఇయర్‌కు ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు కేటాయించేలా ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టినట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
ఎంపికైన ప్రైమరీ స్కూల్స్..
బాన్సువాడ మండలంలో తాడ్కోల్, హన్మాజిపేట్, బొల్లారం, బీబీపేట మండలం శివార్ రాంరెడ్డిపల్లి, బిచ్కుంద మండలంలో జామ మసీద్, హస్గూల్, గెండె నెమ్లి, జుక్కల్ మండలంలో హంగర్గ, లింగంపేట మండలంలో మోతె తండా, షెట్పల్లి, పొతాయిపల్లి, నస్రుల్లాబాద్ మండలంలో బొమ్మదేవునిపల్లి, మహ్మద్ నగర్ మండలం కొమలంచ, సింగితం, నిజాంసాగర్‌లో అచ్చంపేట, రాజంపేట మండలం బసన్నపల్లి, రాజంపేట, రామారెడ్డి మండలం మద్దికుంట, రెడ్డిపేట తండా, రామారెడ్డి, సదాశివనగర్‌లో పద్మాజివాడి, కుప్రియాల్, మర్కల్, తాడ్వాయిలో చిట్యాల్, కన్కల్, కరడ్ పల్లి, ఎల్లారెడ్డి మండలంలో కళ్యాణి ప్రైమరీ స్కూల్స్‌లో ఏఐ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. ఒక్కో స్కూల్లో ఏఐ క్లాస్‌ల కోసం 10 నుంచి 15 మంది స్టూడెంట్స్‌ను సెలెక్ట్ చేశారు.
సమస్యలు అధిగమిస్తే ఫలితాలు..
ఫస్ట్ విడతలో ఏఐ క్లాస్‌ల నిర్వహణలో ఏర్పడిన సమస్యలను అధిగమిస్తే సత్పాలితాలు వస్తాయి. ప్రైమరీ స్కూల్స్‌కు కంప్యూటర్ల కేటాయించి, ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి. లింగంపేట మండలం మోతే తండా వంటి రూరల్ ఏరియాల్లో సెల్ఫోన్సిగ్నల్స్ సైతం సరిగా రాదు. ప్రైమరీ స్కూల్స్ టీచర్లకు కంప్యూటర్లపై మరింత అవగాహన పెంచాలి.
సిగ్నల్ సమస్యతో క్లాసులు వినలేకపోతున్నాం..
ఇంటర్నెట్ లేక సెల్‌ఫోన్ నెట్‌తో ఏఐ క్లాసులు చెబుతున్నారు. 4వ క్లాస్ చదువుతున్నా. ఏఐ క్లాస్‌లతో సబ్జెక్ట్ లు సులువుగా అర్థమవుతున్నాయి. కానీ సిగ్నల్ ప్రాబ్లమ్‌తో పూర్తి క్లాసులు వినలేకపోతున్నాం. వర్షిత, స్టూడెంట్, తాడ్కోల్