హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం( ఆగస్టు 30) తెల్లవారు జామున అరుదైన విమానం దింగింది. వేల్ఆఫ్ ది స్కై గా ప్రసిద్ధిచెందిన ది ఎయిర్ బస్ బెలూగాకు శంషాబాద్ ఎయిర్ పోర్టు స్వాగతం పలికింది.
Airbus A300-608ST Beluga అని పిలువబడే ఈ భారీ విమానం చాలా ప్రత్యేకమైనది.. అతిపెద్ద కార్గో విమానం.. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చింది. ఇంధనం నింపడం కోసం, సిబ్బంది విశ్రాంతి కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఈవిమానం అందరి దృష్టిని ఆకర్షించింది. మధ్యాహ్నం 3గంటలకు థాయితాండ్కు బయల్దేరింది..
ALSO READ | అంబానీని మించిన అదానీ .. ఇండియాలోనే నం. 1
బెలుగా విమానం..శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగడం ఇది మూడోసారి..గతంలో డిసెంబర్ 2022, ఆగస్టు 2023లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో దిగింది. అరుదైన అతిపెద్ద బెలూగా ఈ సందర్శన గ్లోబల్ ఏవియేషన్ నెట్‌వర్క్‌లో RGIA వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రదర్శిస్తూ శుక్రవారం మరోసారి చూపరులను అకట్టుకుంది.