5జీ కోసం టాటాతో ఎయిర్ టెల్ ఒప్పందం

5జీ కోసం  టాటాతో ఎయిర్ టెల్ ఒప్పందం
  • భారత్ లో కలసి పనిచేయాలని నిర్ణయం
  • 5జీ కోసం కొత్త టెక్నాలజీని అభివృద్ధి పరుస్తున్న టాటా గ్రూప్
  • గుర్గావ్ లోని సైబర్ హబ్ లో ట్రయల్స్

న్యూఢిల్లీ: భారతదేశంలో 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రఖ్యాత టెలికాం దిగ్గజ మొబైల్ నెట్ వర్క్ ఎయిర్ టెల్.. మరో దేశీయ టెక్ దిగ్గజం టాటా గ్రూప్ తో ఒప్పందం చేసుకుంది. భారత్ లో 5జి కోసం కలసి పనిచేయాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ టెల్ ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఇటీవలే గుర్గావ్ లోని సైబర్ హబ్ లో ఎయిర్ టెల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. 3500 మెగా హెర్జ్ మిడిల్ బ్యాండ్ స్పెక్ట్రంలో పరీక్షలు చేయగా 1జీబీపీఎస్ స్పీడ్ అందుకున్నట్లు చెబుతోంది.
 పూర్తిగా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించాలనే నిర్ణయానికి కట్టుబడి టాటా గ్రూప్ ‘ది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్’ ను అభివృద్ధి చేసింది. ఓరాన్ ఆధారిత మరియు ఎన్.ఎస్.ఏ/ఎస్ఏ కోర్ ను పరీక్షలు జరుపుతోంది. కాగా టాటా గ్రూప్ తో చేసుకున్న ఒప్పందాన్ని భారతి ఎయిర్ టెల్ ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించింది. భారత్ లో ప్రధాన పోటీదారు అయిన జియో చవకరకం మొబైల్ ఫోన్ కోసం గూగుల్ తో జతకట్టి ప్రయోగాలు చేస్తున్న నేపధ్యంలో భారతి ఎయిర్ టెల్ జియోకు కౌంటర్ గా టాటాతో జతకట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. జియోను దీటుగా ఎదుర్కొనేందుకు సై అంటూ టాటా గ్రూప్ ద్వారా స్వదేశీ టెక్నాలజీని గ్లోబల్ స్థాయిలో డెవలప్ చేస్తోంది.