- కళ్లకు గంతలు కట్లుకొని నిరసన
వనపర్తి టౌన్, వెలుగు: పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌక్‌లో కళ్లకు గంతలు కట్టుకొని విద్యార్థులు నిరసన చేశారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇన్‌చార్జి రమేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలను చెల్లించలేదని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. విద్యా రంగానికి కేంద్ర బడ్జెట్లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గోపాలకృష్ణ, చంద్రశేఖర్, మోహన్, అరవింద్, గణేష్, శివ, బన్నీ, చరణ్, కళ్యాణ్, మురళిపాల్గొన్నారు.