- 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలి
ఓయూ, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగులు, స్టూడెంట్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఓయూ కౌన్సిల్ ఆధ్వర్యంలో మంగళవారం ఓయూ ప్రధాన లైబ్రరీ వద్ద ప్రెస్మీట్పెట్టారు. ఏఐఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి గ్యార నరేశ్, ఓయూ అధ్యక్షుడు లెనిన్, కార్యదర్శి నెల్లి సత్య మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల టైంలో గ్రూప్-–2, గ్రూప్–-3 పోస్టులు పెంచుతామని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని కాంగ్రెస్హామీ ఇచ్చిందన్నారు.
ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేసి జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిందన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక గ్రూప్–2, 3 పోస్టులను పెంచకుండా, కేవలం 11వేల డీఎస్సీ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం కరెక్ట్కాదన్నారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చానని పదేపదే చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు భగత్, రమేశ్, మధు తదితరులు పాల్గొన్నారు.