కామారెడ్డిటౌన్, వెలుగు: ప్రభుత్వ హాస్టల్స్ లో మెస్‌చార్జీలు పెంచాలని ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కామారెడ్డి ప్రభుత్వ హాస్టల్స్‌ను పరిశీలించారు. స్డూడెంట్స్తో మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలన్నారు.
కాస్మోటిక్స్ చార్జీలు ప్రతి నెల రూ.200 ఇవ్వాలన్నారు. హాస్టల్స్‌లో ట్యూటర్స్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతినిధులు పి. శివ ప్రసాద్, రణధీర్, సంపత్ పాల్గొన్నారు.