
హోమ్లీ గర్ల్ ఐశ్వర్య రాజేశ్ ఆఫర్ల మీద ఆఫర్లు కొట్టేస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. కెరీర్ పై ధీమాగా ఉంది. సెలెక్టెడ్ రోల్స్ తో జాగ్రత్తగా కెరీర్ ను నడిపిస్తున్న ఈ ఐశ్వర్యకు తాజాగా వచ్చిన ఆఫర్ సర్ ప్రైజ్ కు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.
వెంకీతో నటించి మంచి మార్కులు కొట్టిన ఐశ్యర్య ఇప్పటికీ టాలీవుడ్ పెద్ద డైరెక్టర్ల దృష్టిలో పడింది. పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా సూట్ అవుతుందన్నట్లుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్.
Also Read:-హానీ రోజ్ స్లీవ్ లెస్ డ్రెస్సులతో కుర్రాళ్ళని రెచ్చగొడుతోంది...
వరుస హిట్లతో రైజింగ్ లో ఉన్న అనిల్ రావిపూడీ.. ఐశ్వర్యను మరోసారి తన సినిమాలో తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. చిరుతో తీయబోయే నెక్స్ట్ మూవీలో ఐశ్వర్యను ఆల్ మోస్ట్ ఫైనల్ చేశారట. చిరు కూడా అందుకు అంగీకరించినట్లు సమాచారం.
నెక్స్ట్ మూవీ చిరుతో అని తెలిసి ఎగిరి గంతేసిందట ఐశ్యర్య. ఐయితే ఇంకా అఫీషియల్ గా టీమ్ ప్రకటించలేదు. వెరీ సూన్ నటీ నటులతో పాటు ప్రాజెక్టుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ప్రకటించనుంది టీమ్.