Maidaan Trailer Review: తెరపైకి మరో స్పోర్ట్స్ డ్రామా..చక్ దే ఇండియా తరహాలో మైదాన్

Maidaan Trailer Review: తెరపైకి మరో స్పోర్ట్స్ డ్రామా..చక్ దే ఇండియా తరహాలో మైదాన్

అజయ్‌‌దేవగన్(Ajay Dvgn)రోగా స్పోర్ట్స్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందిన చిత్రం ‘మైదాన్’(Maidaan)‘బదాయి హో’ ఫేమ్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకుడు. ప్రముఖ ఫుట్‌‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా ఈ  చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రియమణి  కీలక పాత్ర పోషించింది. 

లేటెస్ట్గా మైదాన్ సినిమా ట్రైలర్ రిలీజ్ మేకర్స్. ఇండియన్ ఫుట్‌బాల్లో గోల్డెన్ ఎరాగా భావించే 1942 నుంచి 1952 మధ్య ఆ పదేళ్ల కాలాన్ని ఈ సినిమా ద్వారా ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నారు డైరెక్టర్ అమిత్ ఆర్ శర్మ.

‘ఒక మనిషి, ఒక నమ్మకం, ఒక ఆత్మ, ఇదొక నిజమైన  కథ’ అంటూ వస్తోన్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్ ఫుట్ బాల్ కోచ్‌‌గా కనిపించనున్నాడు. ప్రపంచంలోనే అతి పెద్ద దేశాల్లో ఒకటైన భారత్ కు ఎంత సామర్థ్యం ఉన్నా..ఎన్ని టెక్నీక్స్ ఉన్నా ఫుట్‌బాల్ విషయంలో మాత్రం సత్తా చాటలేకపోతోందంటూ ట్రైలర్ స్టార్టింగ్ లో అజయ్ క్యారెక్టర్ ద్వారా తెలుస్తోంది.

దీంతో అజయ్ ఓ వరల్డ్ క్లాస్ ఫుట్‌బాల్ టీమ్ ను తయారు చేసే పనిలో పడతాడు. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని వస్తోన్న మైదాన్ మూవీపై సినీ లవర్స్ తో పాటు స్పోర్ట్స్ పై ఇంట్రెస్ట్ ఉన్నవారు కూడా వెయిట్ చేస్తున్నారు.

ALSO READ :- కాంగ్రెస్తో టచ్లోకి మల్లారెడ్డి.?

ఇప్పటికే బాలీవుడ్ లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా మూవీస్ అయిన..షారూఖ్ ఖాన్ 'చక్ దే ఇండియా,అక్షయ్ కుమార్ గోల్డ్ లాంటి సినిమాలు కూడా ఈ మైదాన్ ట్రైలర్ చూస్తుంటే గుర్తుకు వస్తాయి. అయితే ఆ సినిమాలు హాకీపై రూపొందగా.. తొలిసారి ఫుట్‌బాల్ ను హైలైట్ చేస్తూ మైదాన్ మూవీని తెరకెక్కించారు. 

జీ స్టూడియోస్, బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం రెండేళ్ల క్రితమే విడుదలవ్వాల్సి ఉంది. కానీ వాయిదా పడుతూ వచ్చింది. జూన్ 23న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో  సినిమా రిలీజ్ కానుంది.