తన తాత మాజీ ప్రధాని..తన తల్లి గొప్ప విద్యావేత్త..తనదేమో అమెరికలో విలాసవంతమైన జీవితం..అయితే ఇవేవి తనకు సంతృప్తిని ఇవ్వలేదు. తన తాత రాజకీయ వారసత్వం కంటే తన తల్లికి విద్యపై ఉన్న అభిరుచే గొప్పదని అనుకుంది. దాని కోసం విదేశాల్లో విలాసవంతమైన జీవితం వదిలి మాతృభూమికి వచ్చింది. తల్లి నేర్పిన విద్యనే వృత్తిగా ఎంచుకుని ఎంతోమంది యువతీయువకుల భవిష్యత్ కు బాటలు వేస్తోంది. ఆమెవరో కాదు దేశంలో ఆర్థిక సంస్కరణలను కొత్త పుంతలు తొక్కించిన పీవీ నరసింహారావు మనవరాలు, ఎమ్మెల్సీ వాణీదేవి కూతురు అజిత.
విదేశం నుంచి తిరిగి వచ్చిన అజిత ఆమె మాదాపూర్ లోని శ్రీ వెంకటేశ్వర లలిత కళల కళాశాల బాధ్యతలు చేపట్టి నేటితరం ఆలోచనలకు అనుగుణంగా ఎంతోమంది యువతీయువకుల భవిష్యత్ కు బంగారు బాటలువేస్తోంది. ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కోసం కళాశాలలోనే గ్రీన్ మ్యాట్ స్టూడియో, ఆడియో మిక్సింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోలను నెలకొల్పింది. చిన్న, మధ్య తరగతి ప్రేక్షకులకు లాభాపేక్ష లేకుండా వాటిని అందుబాటులో ఉంచారు.
తాత బయోపిక్ తీస్తా
దేశాన్ని తన ఆర్థికసంస్కరణలతో మరో స్థాయికి తీసుకెళ్లిన పీవీ నరసింహారావు బయోపిక్ ను తీస్తానని చెబుతోంది అజిత. తన తల్లి వాణీదేవి సలహాలు,సూచనలతో బయోపిక్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తన తాతగారి బహుభాషా ప్రావీణ్యం,అసాధారణ రాజకీయ చాతుర్యంతోపాటు బాహ్యప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను బయోపిక్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తానని వివరించారు.
ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తా
త్వరలోనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు అజిత.ఇక తమ కాలేజీలో ఉన్న గ్రీన్ మ్యాట్ స్టూడియో, ఆడియో మిక్సింగ్,ఎడిటింగ్ డబ్బింగ్ యూనిట్ లను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా సినిమా రంగానికి తమవంతు సేవలందించొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా కాలేజీ ప్రాంగణంలో సినిమా షూటింగ్స్, ఆడియో ఫంక్షన్స్ చేసుకునేందుకు కూడా వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇలా తాత, తల్లికి తగ్గ బిడ్డగా దూసుకెళ్తోంది అజిత.
మరిన్ని వార్తల కోసం
ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో కేసు.. వర్మ కంప్లైంట్
ఫ్యాన్ ప్రతిభకు మెచ్చి, ఆర్థిక సాయం చేసిన రామ్ చరణ్