ఓ బిచ్చగాడు ఐ ఫోన్ కొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. iPhone 16 pro maxని కొనుగోలు చేసి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు.రాజస్థాన్‌కు చెందిన బిచ్చగాడు రూ.1.44 లక్షల విలువైన iPhone 16 Pro Maxని పూర్తిగా నగదు చెల్లించి కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఐఫోన్ మొబైల్ అంటే పిచ్చి చివరకు బిక్షాటన చేసే వారికీ కూడా ఉంది. ఓ యువకుడు యాచన చేస్తూ దాచుకున్న సొమ్ముని మొత్తం ఉపయోగించి ఐ ఫోన్ కొనుగోలు చేశాడు. ఓ బిక్షాటన చేసే యువకుడు చిల్లర నాణాలతో ఏకంగా iPhone 16 Pro Max కొనుగోలు చేశాడు. దాని ఖరీదు అక్షరాలా రూ. 1.44 లక్షలు..ఈ సొమ్మును ఏకంగా ఒకేసారి చెల్లించి పర్చేజ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ @Rohit_Informs పోస్ట్ చేశారు. అందులో బిచ్చగాడు గర్వంగా తన కొత్త ఫోన్‌ని చూపిస్తున్నాడు. ఇంత ఖరీదైన ఫోన్ ఎలా కొన్నారని బాటసారుడు అడగగా.. అతను కేవలం మాంగ్ కే (భిక్షాటన ద్వారా) అని సమాధానమిచ్చాడు. ఇది సోషల్ మీడియా యుగం కదా.. దీనిని చూసిన నెటిజన్లు స్పందించారు. సోషల్ మీడియా యూజర్లు బిచ్చగాళ్లకు ఇచ్చేటప్పుడు డబ్బులు కాదు.. (రొట్టె) తినే పదార్దాలు ఇవ్వండి.. డబ్బులు ఇవ్వవద్దు .. నేను ఇవ్వను మీరు ఇవ్వవద్దు రాశారు. మరొకరు బిచ్చగాడు ఇంత పెద్ద ఐ ఫోన్ కొనుగోలు చేయడం అవాస్తవమన్నారు.
ఆ బిచ్చగాడు పైగా వికలాంగుడు. తనకు కావాల్సిన ఐఫోన్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాడు. ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ను ఖరీదు చేయడానికి వచ్చినట్లు షాక్ లోని సిబ్బందికి చెప్పాడు. దీంతో అక్కడ ఉన్నవారు అంతా షాక్ తిన్నారు. ఆ బిచ్చగాడు తన దగ్గర ఉన్న ఒక గోనె సంచిని బల్లపై గుమ్మరించాడు. దాని నుంచి చిల్లర ధారగా పడింది. ఈ డబ్బులను తీసుకుని తనకు ఐఫోన్ 16 ప్రో మాక్స్ ను ఇవ్వమని అడిగాడు. దీంతో స్టార్ లో పని చేస్తున్న సిబ్బంది అంతా ఆ చిల్లరను లెక్కించి రూ. 1,44,000 లనుతీసుకుని అతనికి ఐఫోన్ 16 ప్రో మాక్స్ ను ఇచ్చారు.
సామాన్యులు ఈ ఫోన్ కొనాలనే కలలో కూడా అనుకోరు. ఎందుకంటే ఈ ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ ఎప్పుడూ అత్యంత ఖరీదైనవిగానే ఉంటాయి. అయితే ఇప్పుడు ఫోన్లకు లోన్లు, ఈ ఎంఐ సదుపాయం కల్పించిన తర్వాత తమ మనసుకు నచ్చినవి, మెచ్చిన ఫోన్ల ను కొనుగోలు చేయడానికి సామాన్యుడు సైతం ముందుకు అడుగు వేస్తున్నాడు. అందుకనే ఐఫోన్ అంటే పిచ్చి ఉన్న వారు లోన్ తీసుకుని మరీ కొనుగోలు చేస్తున్నారు. కాని అజ్మీరాలో బిచ్చగాడు ఏకంగా రూ. 1.44 లక్షలు నగదు చెల్లించి iPhone 16 Pro Max కొనుగోలు చేశాడు.