ఏప్రిల్ 11 మా జీవితంలో మర్చిపోలేని రోజు: ప్రదీప్ మాచిరాజు

ఏప్రిల్ 11 మా జీవితంలో మర్చిపోలేని రోజు: ప్రదీప్ మాచిరాజు

ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. నితిన్, భరత్ దర్శకత్వంలో  మాంక్స్ అండ్ మంకీస్ సంస్థ నిర్మించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని టీమ్ తెలియజేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో ప్రదీప్ మాట్లాడుతూ ‘ఈ సినిమా విడుదలైన  ఏప్రిల్ 11 మా జీవితంలో మర్చిపోలేని రోజు.  ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు  ప్రేక్షకుల పెదవులపై నవ్వు ఉంటుందని ప్రామిస్ చేశాను. 

ఆ ప్రామిస్‌‌ని నిలబెట్టుకున్నాం.  ప్రీమియర్స్ నుంచి సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఆడియెన్స్ థియేటర్స్‌‌లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది. మమ్మల్ని నమ్మి థియేటర్స్‌‌కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు థాంక్యూ సో మచ్’ అని చెప్పాడు. ఈ సక్సెస్‌‌లో భాగమవడం ఆనందంగా ఉందని దీపిక చెప్పింది. ఆడియెన్స్ నవ్వుతుంటే అసలైన కిక్ వచ్చిందని, తాము పడ్డ కష్టానికి ఫలితం చూసుకున్నాం అని డైరెక్టర్స్ నితిన్, భరత్  అన్నారు. గెటప్ శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ రధన్, మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు.