- నేడు అఫ్గానిస్తాన్‌తో ఇండియా తొలి మ్యాచ్
- వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ దూరం
- సిరీస్ నుంచి తప్పుకున్న రషీద్
- రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
మొహాలీ: టీ20 వరల్డ్‌కప్‌కు టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో టీమిండియా ఆఖరి ఇంటర్నేషనల్ షార్ట్ ఫార్మాట్ సిరీస్‌కు రెడీ అయ్యింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో ఇండియా.. అఫ్గానిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 14 నెలల నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ ఈ సిరీస్‌లో బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. అయితే వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తొలి మ్యాచ్‌లో ఆడటం లేదని చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. రోహిత్ ఓపెనింగ్‌తో పాటు కెప్టెన్‌గా టీమ్‌ను నడిపించనున్నాడు. మధ్యలో ఐపీఎల్ ఉన్నా ఈ సిరీస్‌తోనే మెగా ఈవెంట్‌కు సంబంధించిన 15 మంది కోర్ గ్రూప్‌ను రెడీ చేయాలని ద్రవిడ్ బృందం భావిస్తోంది. దీంతో రోహిత్, కోహ్లీతో పాటు కొంత మంది యంగ్‌స్టర్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. వన్డే వరల్డ్ కప్‌లో చెలరేగిన హిట్‌మ్యాన్ అదే ఫామ్‌ను ఇక్కడా కంటిన్యూ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. అతనికి తోడుగా గిల్ ఓపెనింగ్ చేసే చాన్స్ ఉంది. గాయాల కారణంగా సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు. దీంతో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ బ్యాట్లు ఝుళిపిస్తే టీమ్‌లో చోటు సుస్థిరం చేసుకునే చాన్స్ కూడా ఉంది. వికెట్ కీపర్ బెర్తుకు సంజూ శాంసన్, జితేష్ శర్మ పోటీపడుతున్నారు. ఫినిషర్‌గా రింకూ సింగ్ ప్లేస్‌కు ఢోకా లేదు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబే ఆడనున్నాడు. మరో రెండు ప్లేస్‌లకు అర్ష్‌దీప్, అవేశ్ ఖాన్, ముకేశ్ లో ఇద్దరికి చాన్స్ ఇవ్వనున్నారు. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్, మరో స్థానం కోసం రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ పోటీ పడుతున్నారు.
అందరూ హిట్టర్లే..
ఇండియాలో జరిగిన వరల్డ్ కప్‌లో చెలరేగిన అఫ్గానిస్తాన్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అయితే వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ సిరీస్ నుంచి వైదొలగడం ప్రతికూలాంశం. టీమ్‌తో పాటే ఉన్నా ఫిట్‌నెస్ లేకపోవడంతో మ్యాచ్‌లు ఆడటం లేదు. ఇక సెంట్రల్ కాంట్రాక్ట్ సమస్యలను పరిష్కరించుకున్న ముజీబ్, జద్రాన్, నవీన్, ఫరూఖీ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండటం అఫ్గాన్ బలాన్ని రెట్టింపు చేసింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్, రెహమానుల్లా గుర్బాజ్, రెహమత్ షా, నజీబుల్లా జద్రాన్ నుంచి ముప్పు పొంచి ఉంది. స్పిన్నర్లు ముజీబ్, నబీ ఈ సిరీస్‌లో కచ్చితమైన ప్రభావం చూపిస్తారని అంచనా వేస్తున్నారు. టీమ్‌లో ఎక్కువ మంది హిట్టర్లు ఉండటం అఫ్గాన్‌కు లాభించే అంశం.