తెలంగాణ రాష్ట్రంలో ప్రజావాణి అద్భుతం : ఆలిండియా సర్వీసెస్ అధికారుల బృందం  

తెలంగాణ రాష్ట్రంలో ప్రజావాణి అద్భుతం : ఆలిండియా సర్వీసెస్ అధికారుల బృందం  

పంజాగుట్ట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అద్భుతంగా ఉందని పలువురు ఆలిండియా సర్వీసెస్​ఆఫీసర్లు, నేవీ, ఆర్మీ, ఎయిర్​ఫోర్స్​అధికారులు కొనియాడారు. మంగళవారం బేగంపేటలోని మహాత్మా  జ్యోతిరావు పూలే ప్రజాభవన్​ను కల్నల్​రాజేశ్ శర్మ, ఐఎఫ్ఎస్​ఆఫీసర్ గైక్వాడ్, ఐపీఎస్​ ఆఫీసర్​ కంద్ పాల్, ఐఏఎస్ ​ఆఫీసర్ ​విశాఖా యాదవ్​తోపాటు మరో 24 మంది అధికారులు పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సేవలను నోడల్​ఆఫీసర్​ దివ్య దేవరాజన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్​చిన్నారెడ్డి వివరించారు. సీఎం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజావాణిని పరిశీలించిన అధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. 

ప్రజావాణికి 518 దరఖాస్తులు  

ప్రజావాణిలో మంగళవారం 518 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. వాటిలో మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించి 130, విద్యుత్ శాఖకు 82, రెవెన్యూ శాఖకు 72, పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధికి 55, సాంఘిక సంక్షేమ శాఖకు 29, ప్రవాసీ ప్రజావాణికి 1, ఇతర శాఖలకు సంబంధించినవి150 దరఖాస్తులు ఉన్నాయి.