
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు రావాల్సిన సంపదను అంతా ఒక్క కేసీఆర్ కుటుంబమే దోచుకుందని తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సభ్యత్వ సమన్వయ కర్తలతో రాహుల్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని సీరియన్ అయ్యారు. కాంగ్రెస్‌కు ఎవరితోనూ పొత్తు ఉండదని.. కేసీఆర్ వద్ద ధనం, అధికార బలం, పోలీసులు ఉన్నారు కానీ, జన బలం లేదన్నారు. ప్రజల కంటే మించిన శక్తి ఇంకొకటి ఏదీ ఉండదన్నారు.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య భీకర పోరాటం ఉండబోతుందని తెలిపారు.
తెలంగాణ సంపదను దోచుకోడాన్ని, యువత భవిష్యత్తును నాశనం చేయడాన్ని ప్రజలు చూశారన్న ఆయన.. ప్రజలకు రావాల్సిన సంపద ఒక్క కుటుంబం లాభపడిందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను తొలగించడం కాంగ్రెస్ తో పాటు యువత బాధ్యత కూడా అన్నారు. తెలంగాణ యువత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మార్పు తీసుకురావాలన్నారు. సోనియా గాంధీ తెలంగాణ కలను సాకారం చేస్తూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగినా .. తెలంగాణ కాంగ్రెస్ ప్రజలతోనే ఉందన్నారు. ఎందుకంటే ఆ పోరాటంలో న్యాయం ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేయాలని కోరుకుంటున్నా అన్నారు. ఎక్కడ నా అవసరం ఉన్నా నన్ను ఎక్కడికి పంపించినా నేను సిద్ధమని.. నన్ను ఎప్పుడూ పిలిచినా రాడానికి నేను సిద్ధమన్నారు.