అల్లు అర్జున్ తన మాటలు వెనక్కి తీసుకోవాలి : బల్మూరి వెంకట్

అల్లు అర్జున్ తన మాటలు వెనక్కి తీసుకోవాలి :  బల్మూరి వెంకట్
  • ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ 

హైదరాబాద్, వెలుగు: హీరో అల్లు అర్జున్ తన మాటలు వెనక్కి తీసుకోవాలని, ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఆయన పశ్చాతాపం ప్రకటిస్తారని అనుకున్నామని చెపారు. తెలుగువాడి సత్తా చాటడం అంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా? అని ప్రశ్నించారు. రేవతి చనిపోయిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చారని తెలిపారు.