కష్టాల్లో ఇండియన్ మిడిల్‌క్లాస్.. లగ్జరీ జీవితం కోసం వెంపర్లాట..!

కష్టాల్లో ఇండియన్ మిడిల్‌క్లాస్.. లగ్జరీ జీవితం కోసం వెంపర్లాట..!

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఇండియా.  అయితే ప్రస్తుతం ఇక్కడి ప్రజల్లో ఎక్కువ మంది మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతి కింది కేటగిరీలో నివసిస్తున్నారు. కానీ జీడీపీలో 60 శాతాన్ని అత్యవసరాలపై కాకుండా వెకేషన్స్, ఎంటర్టైన్మెంట్, డైనింగ్ వంటి లగ్జరీ ఖర్చుల నుంచి పొందుతున్నారని తేలింది. మెుత్తం ఇలాంటి ఖర్చులో మూడొంతులు భారతీయ మిడిల్ క్లాస్ ప్రజల నుంచి ఖర్చు చేయబడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. 

ఇటీవల భారతీయుల స్పెండింగ్ ధోరణిని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఇంట్లోకి కిరాణా సరుకులు కొనేటప్పుడు తక్కువ రేట్లను చూసే భారతీయలు కార్లను కొనుగోలు చేయటం లేదా జీతంపై ఆధారపడే వ్యక్తులు కనీసం ఎలక్ట్రీషియన్ వద్ద కూడా బేరసారాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రజలు తమ ఫ్యామిలీలతో వెకేషన్ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు తేలింది. అయితే ఈ సడన్ చేంజ్ కి కారణం ఎక్కువ మంది అప్పులను విలాసవంతమైన జీవితం గడపటం కోసం వెచ్చిస్తున్నట్లు తేలింది.

అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మధ్యతరగతి ప్రజల సంఖ్య రానున్న దశాబ్ధకాలంలో రెండింతలవుతుందని ఆక్స్‌ఫర్డ్  ఎకనమిక్స్ నివేదించింది. 2034 నాటికి ఆసియాలో వారి సంఖ్య 6 కోట్ల 87 లక్షలకు చేరుకోవచ్చని చెప్పింది. ప్రధానంగా చైనా, భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశీల నుంచి ఈ మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరుగుదల ఉంటుందని వెల్లడించింది. 

Also Read:-దేశంలో కొత్త విమాన సంస్థలు..

గడచిన 10 సంవత్సరాల నుంచి ఆదాయపు పన్ను అధికారుల డేటా ప్రకారం మధ్యతరగతి ప్రజల ఆదాయం పదిన్నర లక్షలకు చుట్టుపక్కలే ఉన్నట్లు వెల్లడైంది. వాస్తవానికి ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా మధ్యతరగతి ప్రజల ఆదాయం రియల్ టర్మ్ కింద సగానికి తగ్గిపోయిందని ముఖర్జియా వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలు మెరుగైన జీవితం కావాలని కోరుకుంటున్నారు కానీ వారి ఆదాయాలను ద్రవ్యోల్బణం మింగేయటంతో వారు ఎక్కువగా అప్పుల వైపుకు మళ్లుతున్నారని వెల్లడైంది. 

పెరిగిన ట్రావెల్ బూమ్..
ప్రస్తుతం భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ట్రావెల్ బూమ్ కొనసాగుతోందని అధికారిక నివేదికిల ప్రకారం తెలుస్తోంది. దీనికి అసలు కారణం జెన్ జీలు. మిలీనియల్స్ తర్వాత పుట్టిన ఈ కేటగిరీ ప్రజలు ఎక్కువగా టూరిజం, ట్రావెలింగ్ చేసేందుకు తమ డబ్బు, సమయాన్ని కేటాయిస్తుండటమే ట్రావెల్ బూమ్ రావటానికి కారణంగా నిలిచింది. దీంతో హోటల్స్ నుంచి ఫాస్ట్ ఫుడ్స్, డ్రింక్స్ వంటి అనేక ఉత్పత్తులకు యువత నుంచి డిమాండ్ నిరంతరం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. విదేశాల్లో భారతీయ వెజిటేరియన్ ఆహారం లభ్యత పెరిగితే రానున్న కాలంలో భారతీయులు విదేశాలకు టూర్లు వేసే సంఖ్య మరింతగా పెరగవచ్చని తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం యువత ట్రెండ్ ఫాలో అవుతూ లగ్జరీ వస్తువుల వినియోగాన్ని కూడా పెంచటంతో కార్ల నుంచి ఖరీదైన ఎలక్ట్రానిక్స్ వరకు డిమాండ్ పెరుగుతూనే ఉందని తేలిసింది. ఇది ప్రీమియం లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా డిమాండ్ పెరిగేందుకు కారణంగా నిలుస్తోంది. ఇది ఒక విధంగా భారతీయులపై పెరిగిన పాశ్చాచ్య ధోరణిగా కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.