
హైదరాబాద్, వెలుగు: ఫ్యాషన్ ప్రియుల కోసం అమెజాన్ వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ 15వ ఎడిషన్ ను ప్రకటించింది. ఇది డిసెంబర్ 6 నుంచి 11 వరకు ఉంటుంది. ఈ సందర్భంగా చలికాలపు దుస్తులు, యాక్ససరీస్, బ్యూటీ, జ్యుయెలరీలపై ఆఫర్లు ఇస్తామని ప్రకటించింది. డిజైన్, దుస్తులు, బ్యూటీ, ఫుట్ వేర్, యాక్ససరీస్, ట్రావెల్ లగేజీ మొదలైన 1.2 లక్షల ప్రొడక్టులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.