న్యూఢిల్లీ: ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్సోమవారం నుంచి రిపబ్లిక్ డే సేల్‌ను మొదలుపెట్టింది. ఈ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ ఎసెన్షియల్స్, కిరాణా సామగ్రి, అప్లయన్సెస్‌పై 80 శాతం తగ్గింపు ఇస్తామని ప్రకటించింది. మొబైల్ యాక్సెసరీస్‌పై 80శాతం, ల్యాప్‌టాప్‌లపై 40శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 75శాతం , ఫ్యాషన్‌పై 80శాతం, నిత్యావసర వస్తువులపై 50శాతం, పుస్తకాలు, బొమ్మలు, గేమింగ్ యాక్సెసరీస్‌లపై 70శాతం తగ్గింపు ఇస్తామని అమెజాన్ ప్రకటించింది.
అమెజాన్ పే కార్డుతో 5 శాతం డిస్కౌంట్ ఇస్తారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10శాతం ఇన్స్టంట్డిస్కౌంట్ఉంటుంది. ప్రైమ్ సభ్యులు కో–-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే రూ. 2,500 విలువైన వెల్‌కమ్ రివార్డ్‌లను పొందవచ్చు.