అమెజాన్​ ప్రాజెక్టులు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌‌ఖాన్‌‌పేట గ్రామంలో పునరుద్దరించిన పలు ప్రాజెక్టులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ డేటా సీనియర్​ఎగ్జిక్యూటివ్​లు సెర్జియో లొరెయిరో,  సాజీ పీకే,  అదిత్య చౌదరి సమక్షంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. 

ఇక్కడ ప్రారంభించిన వాటిలో పబ్లిక్ పార్కు, వాటర్ ప్యూరిఫయర్ సిస్టమ్, పునర్నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రం భవనాలు, స్వయం సహాయక సంఘ సమావేశ మందిరం ఉన్నాయి. ఈ ప్రాజెక్టులను ‘సెర్చ్’ సహకారంతో అమెజాన్ అభివృద్ధి చేసింది. అమెజాన్ పని చేస్తున్న ప్రాంతాల్లో సమాజంపై సానుకూల ప్రభావం చూపడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం.