న్యూఢిల్లీ: యూఎస్ కంపెనీ వాల్‌గ్రీన్‌కు చెందిన బూట్స్ అలియెన్స్‌ను కొనుగోలు చేసే ఆలోచనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్టు కనిపిస్తోంది. బూట్స్ చెయిన్‌ను కొనేందుకు కంపెనీ బిడ్స్ వేయనుందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు. పెట్రోకెమికల్స్, టెలికం, రిటైల్ ఇలా అనేక సెక్టార్లలో విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, యూరప్‌లో కూడా విస్తరించేందుకు ప్లాన్స్ వేస్తోంది. అక్కడ కంపెనీలను కొనేందుకు మంచి డీల్స్ కోసం చూస్తోంది. ఇందులో భాగంగానే యూకేలో విస్తరించిన బూట్స్ చెయిన్‌ను కొనాలని చూస్తోంది. ఈ కంపెనీ వాల్యుయేషన్ 10 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా.
గోల్డ్‌మ్యాన్ శాచ్స్ ఈ కంపెనీని వేలం వేయనుండగా, రిలయన్స్ బిడ్స్ వేయనుందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. బూట్స్‌కు యూకేలో మొత్తం 2,200 స్టోర్లు ఉన్నాయి. ఇందులో ఫార్మశీలు, హెల్త్, బ్యూటీ స్టోర్లు కూడా ఉన్నాయి. బూట్స్‌లో యూఎస్ కంపెనీ వాల్‌గ్రీన్‌కు మైనార్టీ వాటా ఉంది. బూట్స్‌కు ఐర్లాండ్, నార్వే, నెదర్లాండ్స్, థాయ్‌ల్యాండ్‌లలో కూడా బిజినెస్‌లు ఉన్నాయి.