సీఐఎస్ఎఫ్ వల్ల నక్సలైట్లు, టెర్రరిస్టులు అదుపులో ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్ లో జరిగిన 54 వ సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే సందర్భంగా అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీఐఎస్ఎఫ్ కు నివాళి అర్పించారు. 53ఏళ్లుగా దేశ సేవలో సీఐఎస్ఎఫ్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. CISFని హోంశాఖ బలోపేతం చేస్తుందన్నారు. ప్రాణాలకు తెగించి సీఐఎస్ఎఫ్ సిబ్బంది విధి నిర్వహణలో పాలుపంచుకోవడం దేశానికి గర్వకారణమని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నామన్నారు.
మూడు వేల సిబ్బందితో ప్రారంభమైన సీఐఎస్ఎఫ్ ఇప్పుడు లక్షా 70వేల మందితో సేవలు అందిస్తుందని అమిత్ షా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా రోజు 50లక్షల మంది ప్రయాణికులకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తుందన్నారు. డ్రోన్ టెక్నాలజీ ని సీఐఎస్ఎఫ్ ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. తీవ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో కేంద్ర భద్రత బలగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని తెలిపారు.