ఈనెల 10న ఆదిలాబాద్​కు అమిత్ షా

ఆదిలాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 10న అదిలాబాద్​కు రానున్నట్లు బీజేపీ జిల్లా ఇన్​చార్జ్​బద్దం లింగారెడ్డి వెల్లడించారు. బుధవారం పార్టీ ఆఫీసులో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్​తో కలిసి సమావేశమై సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భారీ ఏర్పాట్లు చేస్తున్నామని, సభను విజయవంతం చేసేందుకు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

10న మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించే సభకు సుమారు లక్ష మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.