32 ఏళ్ల తర్వాత..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్‌‌‌‌లో ఇప్పుడో సినిమా రాబోతోంది.  సూర్య హీరోగా ‘జై భీమ్‌‌‌‌’ తీసి మెప్పించిన టీజే జ్ఞానవేల్ దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. రజినీకాంత్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 170వ సినిమా. గతంలో అమితాబ్‌‌‌‌తో కలిసి అంధా కానూన్, గిరఫ్తార్, హమ్ లాంటి హిందీ చిత్రాల్లో నటించారు రజినీకాంత్. 

దాదాపు ముప్ఫై రెండేళ్ల తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్‌‌‌‌లో సినిమా వస్తుండడం విశేషం. జులై నెలాఖరులో షూటింగ్ మొదలవబోతోంది. ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇందులో ఫేక్‌‌‌‌ ఎన్‌‌‌‌కౌంటర్స్‌‌‌‌కు వ్యతిరేకంగా పోరాడే రిటైర్డ్‌‌‌‌ పోలీసాఫీసర్‌‌‌‌‌‌‌‌గా రజినీకాంత్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. మరో పాత్ర కోసం మొదట విక్రమ్‌‌‌‌ను సంప్రదించారనే టాక్ వినిపించింది. ఫైనల్‌‌‌‌గా అమితాబ్‌‌‌‌ బచ్చన్‌‌‌‌ ఆ పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇటీవలే ‘జైలర్’ మూవీ షూటింగ్ పూర్తి చేశారు రజినీ. నెల్సన్‌‌‌‌ దిలీప్‌‌‌‌ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్టు 10న విడుదల కానుంది. మరోవైపు ‘లాల్ సలామ్‌‌‌‌’ అనే చిత్రంలో అతిథి పాత్రను పోషిస్తున్నారు రజినీకాంత్.