
కొండపాక(కొమురవెల్లి), వెలుగు: గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నెం. 60 ప్రకారం వేతనాలు పెంచి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు అమ్ముల బాల్ నర్సయ్య డిమాండ్ చేశారు. మంగళవారం కొండపాక పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెం.51తో మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని తీసుకొచ్చి కారోబార్, బిల్ కలెక్టర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందన్నారు.
జూలై 6 నుంచి జరిగే రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెను పంచాయతీ ఉద్యోగ, కార్మికులు సక్సెస్ చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో జేఏసీ జిల్లా జనరల్ సెక్రటరీ బర్మ కొమురయ్య, కోకన్వీనర్ ప్రభాకర్, మండల అధ్యక్షుడు ఆరుట్ల నర్సింహులు, నాయకులు కొమ్ము నర్సింలు, తాటోజు మల్లేశం, తలపాక లక్ష్మి, ఆంజనేయులు, కనకవ్వ, పుష్ప, నర్సవ్వ, లచ్చవ్వ, రాజు, నవీన్, లక్ష్మణ్, మల్లేశం, చంద్రయ్య, ఐలయ్య, భిక్షపతి, శ్రీనివాస్, కిష్టయ్య పాల్గొన్నారు.