హైదరాబాద్లో భూకంపం ఎక్కడెక్కడ వచ్చిందంటే.. ఈ ఏరియాల్లో ఉన్నోళ్లు వణికిపోయారు !

హైదరాబాద్: భాగ్యనగరం బుధవారం ఉదయం 7 గంటల సమయంలో భూకంపం భయంతో వణికిపోయింది. ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్న తమ వాళ్లకు ఏమైందోనన్న కంగారుతో ఊళ్ల నుంచి కాల్స్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి. హైదరాబాద్ సిటీలోని మణికొండ, బండ్లగూడ జాగీర్, కిస్మత్పూర్, అత్తాపూర్, నార్సింగి ఏరియాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ సిటీలో భూకంపం సంభవించినట్లు తెలిసింది.

తెలంగాణలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3 నమోదైంది. మూడు నుంచి ఐదు సెకన్లు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర మొత్తానికి ములుగు జిల్లా కేంద్ర బిందువుగా ఉన్నటు వంటి భూకంప కేంద్రం ఇచ్చిన నివేదికను పరిశీలించగా భూమి లోపల 40 కిలోమీటర్ల నుంచి ఈ రేడియేషన్ ఉద్భవించినట్లు తెలిసింది.

Also Read :- కాసేపంతా అల్లకల్లోలం.. వీడియోలు మీరూ చూడండి

హైదరాబాద్లో భూకంపం ఎక్కడెక్కడ వచ్చిందంటే..
* హైదరాబాద్లోని కిస్మత్పూర్లో స్వల్పంగా కంపించిన భూమి.. భయాందోళన గురైన ప్రజలు
* కిస్మత్పూర్, అత్తాపూర్, నార్సింగి, మణికొండ, బండ్లగూడ జాగీర్లో కంపించిన భూమి
* రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో 2 సెకండ్ల పాటు స్వల్ప భూకంపం

భూకంపం వల్ల తెలంగాణలో ఎక్కడ ఏమైందంటే..
* ఖమ్మం పట్టణంతో పాటు కామేపల్లి , కారేపల్లి మండలాల్లో కంపించిన భూమి
* ఒక్కసారిగా ఇండ్లల్లో వైబ్రేషన్ రావడంతో బయటికి పరుగులు తీసిన జనం
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా మూడు సెకండ్ల పాటు భూకంపం
* మణుగూరు, అశ్వాపురం మండలాల్లో సుమారు ఆరు సెకండ్ల పాటు కంపించిన భూమి
* వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉదయం స్వల్ప భూకంపం
* 7.28 నిమిషాలకు 3 సెకండ్లు కంపించిన భూమి
* ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంరొయ్యురు గ్రామంలో భూమి కంపించడంతో ఇంటి గోడ కూలింది
* మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట్లో ఉదయం  స్వల్పంగా కంపించిన భూమి
* జగిత్యాల జిల్లాలో పలుచోట్ల ఉదయం 7.30 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూ ప్రకంపనలు
* జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడ, కృష్ణానగర్, విద్యానగర్, కరీంనగర్ రోడ్డు, చుట్టు పక్కలా గ్రామాల్లో భూ ప్రకంపనలు
* జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో సీసీ కెమెరాలో భూకంపం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి