పైసల కోసమే యజమానిని కిడ్నాప్ చేసిన డ్రైవర్

పైసల కోసమే యజమానిని కిడ్నాప్ చేసిన డ్రైవర్

రంగారెడ్డి : ఓ పాత నేరస్తుడు డ్రైవర్ గా చేరి యజమానిని కిడ్నాప్ చేసి భారీ మొత్తంలో నగదు దోచుకుందామని చేసిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లోని కిస్మాత్ పూర్ ప్రాంతానికి చెందిన సాయికిరణ్ రెడ్డి అనే వ్యక్తి.. గచ్చిబౌలిలో హీరో షోరూంను నిర్వహిస్తున్నాడు. ఇతని వద్ద డ్రైవర్ గా చేరిన సుదర్శన్ పై గతంలో రాయదుర్గం, గజ్వేల్ మహంకాళి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన నేర చరిత్ర ఉంది.

అయితే.. యజమాని సాయి  కిరణ్ రెడ్డిని కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేద్దామని మరో ముగ్గురు స్నేహితులతో సుదర్శన్ పథకం పన్నాడు. ఇందులో భాగంగా ఈ నేల 27న సాయికుమార్ రెడ్డిని కారులో గచ్చిబౌలికి తీసుకెళ్తూ రాజేంద్రనగర్ పత్తికొండ వద్ద మూత్ర విసర్జన కోసం దిగాడు. సుదర్శన్ రాక కోసం అక్కడే ఎదురుచూస్తున్న స్నేహితులు అర్జున్, అనిల్, విజయ్, సాయి కుమార్ రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. వారితో తోపులాడిన సాయికుమార్ రెడ్డి ఎట్టకేలకు తప్పించుకున్నాడు.

అదే సమయంలో అర్జున్, అనిల్, విజయ్, సాయి కుమార్ రెడ్డి కారుతో సహా పారిపోయారు. ఇదే విషయంపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. సుదర్శన్ పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. కొత్తగా డ్రైవర్లను పెట్టుకున్న వాళ్లు, డ్రైవర్ల  పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే డ్యూటీలో జాయిన్ చేసుకోవాలని కోరారు.