జూన్ 17 వరకు ఒంటిపూట బడులు..విద్యాశాఖ ఉత్తర్వులు

 జూన్ 17 వరకు ఒంటిపూట బడులు..విద్యాశాఖ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ లో జూన్ 12 నుంచి యథావిధిగా స్కూల్స్ ప్రారంభం అవుతున్నప్పటికీ  ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వడగాల్పులు, తీవ్ర ఎండల వల్ల జూన్ 17 వరకు ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహిస్తామని ప్రకటించింది.   ఉదయం 9 లోపు రాగిజావ,  12 లోపు మధ్య భోజనం  పెడతారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుంది. జూన్ 19 నుంచి బడులు పూర్తిస్థాయిలోనడవనున్నాయి.

 తెలంగాణలో  స్కూల్స్ రీ ఓపెన్ పై   విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.   ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 12నుంచి బడులు తెరుచుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వేసవి సెలవులు పొడిగించే ఆలోచన లేదని యథావిధిగా షెడ్యూల్​ ప్రకారమే రీ ఓపెన్​ చేయనున్నట్లు వెల్లడించారు.