జగిత్యాల టౌన్, వెలుగు: అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జగిత్యాల కలెక్టరేట్ ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు.
ఈసందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రజిత మాట్లాడుతూ అంగన్‌వాడీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, బయోమెట్రిక్ హాజరును అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తమను దొంగలుగా చిత్రికరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు.