కామారెడ్డి టౌన్, వెలుగు: అంగన్వాడీ ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు, ఈ– పంచాయతీ ఆపరేటర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు, ఈ–పంచాయతీ ఉద్యోగుల దీక్షా శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపారు.
క్షేత్రస్థాయిలో సేవలందించే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అశ్రద్ధ చేయడం సరికాదన్నారు. ఆయా వర్గాల న్యాయపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టౌన్ ప్రెసిడెంట్ పండ్ల రాజు పాల్గొన్నారు.