Geethanjali Malli Vachindi Trailer: నువ్వు కోన వెంకట్ గీతాంజలివే దెయ్యంలా తగులుకున్నావు

సౌత్ బ్యూటీ అంజలి(Anjali) ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ గీతాంజలి. 2014లో వచ్చిన ఈ సినిమా దర్శకుడు రాజ్ కిరణ్ తెరకెక్కించగా..శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, రావ్ రమేష్, బ్రహ్మానందం కీ రోల్స్ లో కనిపించారు. అయితే దాదాపు 10 సంవత్సరాల తరువాత గీతాంజలి సినిమాకు సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindi) అనే సినిమా తెరకెక్కుతోంది.ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ అందిస్తున్న ఈ సినిమాను శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్నారు. 

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైల‌ర్ గ‌మ‌నిస్తే..నవ్విస్తూనే..గుండెల్లో భయం పెంచేతుంది. డైరెక్టర్స్ మీద శ్రీనివాస్ రెడ్డి, దెయ్యం పాత్రలో రవి శంకర్, ఇక ట్రైలర్ చివర్లో ఆలీ.."నువ్వు మణిరత్నం గీతాంజలివి కాదే..కోన వెంకట్ గీతాంజలివే..దెయ్యంలా తగులుకున్నావు ' అని చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 

మొద‌టి పార్ట్‌లో లాగానే ఈ సినిమాలో కూడా కమెడియన్  శ్రీనివాస్‌ రెడ్డి ద‌ర్శ‌కుడిగా న‌టిస్తుండ‌గా..హార్ర‌ర్ ఫిల్మ్ తీద్దామని అంజ‌లి, తన టీమ్‌తో కలిసి ఒక పాడుబ‌డిన భ‌వంతిలోకి వెళతారు. అయితే ఆ భ‌వంతీలో షూటింగ్ జ‌రుగుతుండ‌గా..వారికి దెయ్యాలు ఉన్న‌ట్లు అనుకొని సంఘ‌ట‌న‌లు ఎదురవుతుంటాయి. అయితే ఆ ఇంట్లో ఉన్న మూడు దెయ్యాలు ఎక్క‌డివి.. వారికి ఏం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే అంజలి అండ్ టీమ్ ఏం చేసింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.అంజలికి ఇది 50వ చిత్రం. 

ALSO READ :- ఈ యాంకర్ అదరలేదు.. బెదరలేదు.. భూకంపానికి ఊగుతున్నా..

ఈ సినిమాను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌‌న్‌‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. భాను భోగ‌‌వ‌‌ర‌‌పు, నందు శ‌‌వ‌‌రిగ‌‌ణ‌‌ మాటలు రాస్తున్నారు.   ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు.ఈ మూవీ ఏప్రిల్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.