ఎమ్మెల్యే రాజాసింగ్​పై మరో కేసు

ఎమ్మెల్యే రాజాసింగ్​పై మరో కేసు
  • మంగళ్​హట్ పీఎస్​లో నమోదు

మెహిదీపట్నం, వెలుగు: గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్​పై మంగళ్ హట్​ పోలీస్ స్టేషన్​లో మరో కేసు నమోదైంది. ధూల్​పేట జాలి హనుమాన్ దేవాలయం సమీపంలో నుంచి శోభాయాత్ర కొనసాగుతుండగా, పోలీసులు, కార్యకర్తలకు మధ్య చిన్నపాటి తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ఊరుకోబోమని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించి రాజాసింగ్​పై మంగళవారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. అంతకు ముందే రాజాసింగ్ పై మంగళ్​హట్ పీఎస్ లో కేసు నమోదైంది.

 ఆదివారం మధ్యాహ్నం శ్రీరామనవమి శోభాయాత్రలో డీజే సౌండ్ పెట్టడం, పోలీసుల ఆదేశాలు పాటించకపోవడంతో ముగ్గురు ఆర్గనైజర్లపై పోలీసులు కేసు పెట్టారు. వీరిలో భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు భవంత్​రావు, శ్రీరామనవమి పల్లకి సేవా శోభాయాత్ర నిర్వాహకుడు ఆనంద్​సింగ్ లోథ్​తోపాటు రాజాసింగ్​కూడా ఉన్నారు.