ఏపీ సీఎంవో ప్రక్షాళన.. ముగ్గురు అధికారులు బదిలి

ఏపీలో ప్రభుత్వం మారుతుంది.  ఎన్నికల్లో టీడీపీ కూటమికి ప్రజలు పట్టం కట్టడంతో ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు.  అయితే ఈలోపుగానే ఏపీ సీఎంవోను ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పటికే కొత్త సీఎస్​ గా నీరబ్​కుమార్​ ను నియమించగా... మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏపీ సీఎంవోలో కీలక బాధ్యతలు స్వీకరించిన ముగ్గురు అధికారులను బదిలీ చేస్తూ సీఎస్​ నీరబ్​కుమార్​ ఉత్తర్వులు జారీచేశారు. పూనం మాలకొండయ్య, ముత్యాలరాజు, నారాయణ భరత్​ గుప్తాలను బదిలీ చేస్తూ జీఏడీలో రిపోర్టు చేయాలని సీఎస్​ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

సీనియర్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య ప్రస్తుతం సీఎంవోలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమె జూన్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇక, రేవు ముత్యాలరాజు సీఎంవోలో కార్యదర్శి హోదాలో ఉండగా, నారాయణ భరత్ గుప్తా అదనపు కార్యదర్శిగా ఉన్నారు.