KRMB కి లేఖ రాసిన ఏపీ  ప్రభుత్వం 

అమరావతి: కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి ఏపీ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. సెప్టెంబర్ 1వ తేదీన చేపట్టిన సమావేశంలో అజెండాపై స్పందించి లేఖ రాసింది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు కృష్ణా నీటిని చెరి సమానంగా చెరో 50 శాతం నీళ్లు పంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించగా దాన్ని కేఆర్ఎంబీ అజెండాలో పెట్టింది. చెరి సగం నీటి పంపిణీ సమంజసం కాదని.. అభ్యంతరం వ్యక్తం చేస్తూ నీటి పంపకాలు ఏపీకి 70 శాతం, తెలంగాణకు 30 శాతం కేటాయించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం తరపున ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి లేఖ రాశారు. కృష్ణా నీటిని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా చెరిసగం అంటే 50శాతం నిష్పత్తితో నీటిని పంచుకోవాలనే ప్రతిపాదనకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని ఈఎన్సీ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు ఇది ట్రిబ్యునల్, అవార్డులకు పూర్తి విరుద్ధమని, గతలో కేంద్రం, పునర్విభజన చట్టం ప్రకారం ట్రిబ్యునల్ తీర్పులను పరిగణలోకి తీసుకుని సాగు విస్తీర్ణం, ప్రాజెక్టుల ఆధారంగా నీటి కేటాయింపులు జరిగాయని గుర్తు చేస్తూ ఏపీకి 70 శాతం, తెలంగాణకు 30 శాతం కేటాయించాలని కోరారు.