
- రాహుల్ గాంధీ దూరదృష్టికి నిదర్శనం: ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన దేశానికి ఆదర్శమని, ఇది చారిత్రాత్మక ఘట్టని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనమని మంగళవారం ఆమె ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు ఉన్నారని.. అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండడం విస్మయపరిచిన అంశమని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ కులగణన చేయాలని ఏపీ సీఎం చంద్రబాబును ఆమె డిమాండ్ చేశారు.