యాపిల్ కంపెనీ యూజర్ల కోసం కొత్త యాప్ తీసుకొచ్చింది. దానిపేరు యాపిల్ స్టోర్. యాపిల్ ప్రొడక్ట్స్, సర్వీస్‌లు వాడేవాళ్లకు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా కంపెనీ హోమ్ డెలివరీ, పికప్ వంటి సర్వీస్‌లను అందించనుంది. ఈ యాప్ ద్వారా టౌన్లలో కూడా తమ ప్రొడక్ట్స్‌ని అందుబాటులోకి తీసుకురానుంది.
ఇప్పటికే ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ యాప్ యాపిల్ స్టోర్ యాప్ పేరుతో ఇండియాలోకి తీసుకొచ్చింది. ఇందులో యాపిల్ ట్రేడ్ ఇన్, ఫైనాన్సింగ్ ఆప్షన్ వంటి ముఖ్యమైన రిటైల్ ప్రోగ్రామ్‌ల వివరాలను తెలుసుకోవచ్చు. ఇది లేటెస్ట్ ప్రొడక్ట్స్, రిటైల్ ప్రోగ్రామ్స్ గురించి అప్డేట్లు ఇస్తుంది. కంపెనీకి చెందిన కొత్త ప్రొడక్ట్స్ కొన్న తర్వాత దాని వాడకానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవాలంటే ఈ యాప్‌లోని ‘గో ఫర్దర్’ ట్యాబ్ సాయంతో ఎక్స్‌పర్ట్స్‌ని సంప్రదించొచ్చు. అంతేకాదు.. మ్యాక్‌లో పవర్ఫుల్ చిప్, ఎక్స్ట్రా స్టోరేజీ వంటి మార్పులు చేసుకోవచ్చు. డిజిటల్ గిఫ్ట్ మెసేజ్‌లను కస్టమైజ్ చేసే ఆప్షన్‌ను కూడా అందించాలనుకుంటోంది.