రాకెట్లు, సుతిల్ బాంబులు, చిచ్చు బుడ్లు బోలెడు ఆనందాన్ని ఇస్తాయి. కానీ, అవి కాల్చేటప్పుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం వెంటే వస్తుంది. అందుకే పిల్లలు, పెద్దలు పటాకులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
పటాకులు కాల్చేటప్పుడు కాటన్ డ్రెస్లనే వేసుకోవాలి.
గడ్డివాములు, పశువుల పాకలు, గుడిసెలు, పెట్రోల్ బంక్లకి దూరంగా పటాకులు కాల్చాలి.
మధ్యలో ఆగిపోయిన వాటిని తిరిగి వెలిగించే ప్రయత్నాలు చేయకూడదు.
అవి చేతిలోకి తీసుకోగానే పేలే ప్రమాదం ఉంది.
పటాకులు కాల్చేటప్పుడు ముందు జాగ్రత్తగా నీళ్ల బకెట్ పక్కన పెట్టుకోవాలి.
చెప్పులు వేసుకునే బాంబులు కాల్చాలి.
బాంబులు కాల్చేటప్పుడు, కాల్చిన తర్వాత చేతులను నోట్లో, ముక్కుల్లో పెట్టుకోవద్దు.
బట్టలపై నిప్పురవ్వలు పడితే అవి రాజుకోకుండా వెంటనే ఒంటి పై దుప్పటి కప్పాలి. లేదా నేలపై అటుఇటు బొర్లాడాలి.
అగ్గిపుల్లలకి బదులు కొవ్వొత్తులు, అగరబత్తులతో పటాకులు వెలిగించాలి.
సర్టిఫైడ్ షాపుల నుంచే పటాకులు కొనాలి. గ్యాస్ స్టవ్, కిరోసిన్ పొయ్యిల దగ్గర వాటిని పెట్టకూడదు.
జేబుల్లో పటాకులు పెట్టుకుని తిరగొద్దు.