ఆరెకటిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : అశోక్ కుమార్

ఆరెకటిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : అశోక్ కుమార్
  • ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అశోక్ కుమార్ 

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆరెకటిక జనాభా నాలుగు శాతానికి పైగా ఉన్నా కూడా సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదని ఆరెకటిక అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూంపల్లి అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి రూ. 500 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆరెకటికల సంక్షేమం భవిష్యత్తు అనే అంశంపై రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. 

ఇందులో పాల్గొన్న అశోక్ మాట్లాడుతూ.. ఆరెకటికలను బీసీ డీ నుంచి బీసీ ఏకు మారుస్తూ జీవో ఇవ్వాలని కోరారు. 90 శాతం  సబ్సిడీతో ఆరెకటికలకు గొర్లను పంపిణీ చేసి, మటన్ షాపులకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మేకల మండీలను అధునీకరించి ఆరెకటికలకు అప్పగించి, ఇంటిగ్రేటెడ్ మటన్ మార్కెట్ పూర్తి హక్కులను కల్పిస్తూ జీవో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.