తాగునీటి సమస్య రాకుండా చూడండి : పైడి రాకేశ్​రెడ్డి

తాగునీటి సమస్య రాకుండా చూడండి :  పైడి రాకేశ్​రెడ్డి
  • ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి

ఆర్మూర్, వెలుగు :  నియోజకవర్గవ్యాప్తంగా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం ఆర్మూర్​లోని తన క్యాంప్ ఆఫీస్​లో ఐదు మండలాల రెవెన్యూ, ఇరిగేషన్, మండల పరిషత్ అధికారులు, ఆర్​డబ్ల్యూఎస్, ఆర్డీవో రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజుతో కలిసి నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడారు.

 ఆయా మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై చర్చించారు. మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ నిబంధనల మేరకే వెంచర్లు ఉండాలని, అనుమతి లేని ఇండ్ల నిర్మాణాలను అడ్డుకోవాలన్నారు.  మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులు పెట్టాలని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలన్నారు.