
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివారులో నిజాంసాగర్ కెనాల్ భూమి హద్దు సర్వేను మంగళవారం ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్ పరిశీలించారు. కెనాల్ భూమి కబ్జా జరుగుతుందన్న ఫిర్యాదుల మేరకు ఆర్డీవో భూమి సర్వే దగ్గరుండి చేయించారు. కెనాల్ చుట్టూ ఉన్న ప్రైవేటు భూ యజమానులను పిలిపించి వారి డాక్యుమెంట్స్ పరిశీలించారు. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్స్ అశోక్, ఇరిగేషన్ డీఈ కృష్ణమూర్తి, ఈఈ రామారావు, తహసీల్దార్ సత్యనారాయణగౌడ్ తదితరులు ఉన్నారు.