
- ఆర్మూర్ స్పెషల్ ఆఫీసర్ అంకిత్
ఆర్మూర్, వెలుగు: -వేసవి కాలం ప్రారంభమైనందున ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) ఆర్మూర్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ అంకిత్ మున్సిపల్ అధికారులకు సూచించారు. గురువారం మున్సిపల్ కమిషనర్ రాజుతో కలిసి పట్టణంలో పర్యటించారు.
బోర్ రిపేర్ పనులను పరిశీలించి మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. ఈనెలాఖరు వరకు రెగ్యులరైజ్ కోసం అవకాశం ఉన్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్మూర్ మండలం కోమన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పనులను పరిశీలించిన ఆయన అధికారులకు సూచనలు చేశారు.