ఇవాళ నుంచి ఆర్ట్​ ఫెస్టివల్

ఇవాళ నుంచి ఆర్ట్​ ఫెస్టివల్

ఖైరతాబాద్, వెలుగు: ఏటా ముంబై, ఢిల్లీ, బెంగళూరులో నిర్వహించే ఇండియా ఆర్ట్​ఫెస్టివల్​ను ఈసారి హైదరాబాద్​లో నిర్వహిస్తున్నట్లు ఆర్ట్ ఫెస్టివల్ డైరెక్టర్, బాంబే ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు రాజేంద్ర పాటిల్​ తెలిపారు. రేతిబౌలిలోని కింగ్స్ కోహినూర్(క్రౌన్) కన్వెన్షన్​సెంటర్​లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఫెస్టివల్​ జరగనుంది. 

దేశంలోని  250 మంది కళాకారులు 3,500 కళాఖండాలను ప్రదర్శించనున్నారు. ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు ఫెస్టివల్​ కొనసాగనుంది. అలాగే ఫ్యూజన్ షోలు, సంగీత కచేరీలు, లైవ్ పెయింటింగ్ ఉంటాయని సిటీ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ రమణారెడ్డి, తెలిపారు.