ఇందిర‌మ్మ ఇండ్ల స‌ర్వే వివ‌రాల ప‌రిశీల‌న

గోదావ‌రిఖ‌ని, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల ద‌రఖాస్తుదారుల సర్వే వివ‌రాల‌ను ప‌రిశీలించ‌డంతో పాటు, కొత్త రేష‌న్ కార్డులు జారీ చేసేందుకు చేప‌ట్టిన వెరిఫికేష‌న్ తీరును పెద్దపల్లి అడిషనల్‌ కలెక్టర్, రామగుండం బల్దియా కమిషనర్ అరుణ శ్రీ గురువారం పరిశీలించారు. 38 వ డివిజన్ ఇందిరానగర్‌లో ఆమె పర్యటించారు. 

క్షేత్ర స్థాయిలో సర్వే ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 21, 22 లోపు కార్పొరేష‌న్ పరిధిలోని 50 డివిజన్లలో నిర్వహించే వార్డు సభల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాల‌న్నారు. ఆయా పథకాల అర్హుల ఎంపిక ప్రక్రియను త్వరతగతిన పూర్తి చేయాల‌ని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు, రెవెన్యూ సూపరింటెండెంట్ ఆంజనేయులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌‌ శంకర్ రావు ఉన్నారు.