ర్యాపిడ్‌‌‌‌లో అరవింద్‌‌‌‌కు సంయుక్త అగ్రస్థానం

ర్యాపిడ్‌‌‌‌లో అరవింద్‌‌‌‌కు  సంయుక్త అగ్రస్థానం

వార్సా (పోలాండ్):  గ్రాండ్ చెస్‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌లో భాగంగా జరుగుతున్న సూపర్‌‌‌‌‌‌‌‌ బెట్  ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్‌‌‌‌లో  ఇండియా గ్రాండ్‌‌‌‌మాస్టర్ అరవింద్ చిదంబరం సత్తా చాటుతున్నాడు. బుధవారం జరిగిన చివరి గేమ్‌‌‌‌లో ఫ్రాన్స్‌‌‌‌ మేటి ప్లేయర్ అలీరెజా ఫిరౌజాను ఓడించి రాపిడ్  సెక్షన్‌‌‌‌లో 11 పాయింట్లతో సంయుక్తంగా  అగ్రస్థానంలో నిలిచాడు.

 స్లోవేనియా జీఎం వ్లాదిమిర్ ఫెడోసీవ్, ఫిరౌజా కూడా తలో 11 పాయింట్లతో ఉన్నారు. మరో ఇండియా జీఎం ఆర్. ప్రజ్ఞానంద చివరి రెండు గేమ్స్‌‌‌‌లో విజయాలు సాధించి 10 పాయింట్లతో అమెరికన్ లెవోన్ అరోనియన్‌‌‌‌తో కలిసి  నాలుగో స్థానంలో నిలిచాడు. బ్లిట్జ్ ఈవెంట్‌‌‌‌లో 18 గేమ్స్ తర్వాత విన్నర్‌‌‌‌‌‌‌‌ను తేలుస్తారు.