- వైద్యారోగ్య శాఖ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ధర్నా
బషీర్ బాగ్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్ కోఠిలోని వైద్య, ఆరోగ్య శాఖ ఆఫీసు ముందు వేలాది మంది ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యకురాలు పి.జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నీలాదేవి, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ స్పందించి డిమాండ్లను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హమీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.